భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఎంత చరిత్ర ఉందొ , దానికి సమానమైన పోరాట చరిత్ర కలిగింది తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర.
తెలంగాణ అవతరణం వెనకాల ఎన్నో ఏళ్ళ చరిత్ర, ఎందరో వీరుల ప్రాణత్యాగం ఉంది,
కొమర్రాజు సీతారామయ్య, బుచ్చయ్య చౌదరి, చుక్కా రామయ్య వంటి ఉద్యమ పెద్దలు వేసిన పోరాట దారిలో అమరులైన వీరులెంతమందో.
తెలంగాణ ఉద్యమానికి ఆద్యం నిజాం పాలనలో రైతన్నలకు కలిగిన అసహనత,
నిజం పాలనలో ఉన్న భూస్వామ్య వ్యవస్థ రైతులను మానసికంగా అలాగే శారీరకంగా కష్టపెట్టింది, రైతు కేవలం కష్టం చేయాలి కానీ భూములన్నీ దొరల ఆధీనం లో ఉండేవి,
రైతు చెమటోడ్చి చేసిన సేద్యాన్ని దొరలు అనుభవించేవారు, వాళ్ళు పండించిన పంటలో మూడింట రెండువంతులు భూస్వామ్యులకే చెందేవి, దీనివల్ల రైతు ఆర్థికంగా చాల వెనకబడిపోయాడు. దానివల్ల అప్పులపాలై జీవితాంతం దొరల దగ్గర ఒక బానిసల్లా బ్రతకాల్సిన పరిస్థితి రైతులకు కలిగింది.
రైతులను ఆర్థికంగానే కాదు, శారీరకంగా కూడా బాధపెట్టేవారు,
తమ కంటికి నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్ళి మానభంగాలు, హత్యలు చేసేవారు. ఎదురుచెప్పలేని కూలీలు రైతులు తోడేళ్ళ మధ్య జింకపిల్లల్లా జీవితాలు గడిపేవారు.
వయసొచ్చిన ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలో , ఏ దొర కలనాగుల వోచి తమ బిడ్డ మాన ప్రాణాలను బలి తీసుకుందడా అని ఆ కాలం తల్లి దండ్రుల ఆవేదనని మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇన్ని సమస్యల మధ్య సతమతమవుతున్న ప్రజలకు నిజం ప్రభుత్వం “శాయం” అనే అదనపు పన్ను భారాన్ని వేసింది, ఒకవేళ ఏ రైతైనా శాయం కట్టలేకపోతే వారి పంటలను, మేతను, పశువులను, ఇల్లుపరికరాలను దౌర్జన్యం గా కొట్టి మరి తీసుకునేవారు, ఆడవాళ్లను మానభంగం చేయడం, పిల్లలను హింసించడం లాంటివి చేసి ప్రజల్లో భయాన్ని పెంచి పన్ను కట్టించుకునేవాళ్ళు. దీనిద్వారా పంట పండకపోయిన, తమకు తిండి లేకపోయినా అప్పు తెచ్చి మరీ పన్ను కడుతూ రైతులు అనేక ఇబ్బందులు పడేవారు.
మితిమీరిన అణచివేత ప్రజలలో తీవ్రమైన అసహనాన్ని, ఆగ్రహాన్ని పెంచింది.
దానితో ప్రజలు తిరుగుబాటు దారి పట్టారు, ఈ తిరుగుబాటు మొదట నిజం పాలకు వ్యతిరేకంగా కాదు, రైతుల హక్కులకోసం మొదలైంది. ఆ తిరుగుబాటు అంచలంచలుగా ప్రతి పల్లెల్లోని జమిందారులపైనా, దొరలపైనా మొదలైంది.
ఈ ఉద్యమానికి ఉతకర్ర కమ్యూనిస్టు పార్టీ,
పుచ్చలపల్లి సుందరయ్య రైతులకు మార్గదర్శనాన్ని చేసారు. తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసేవారు.
బొగ్గు వెంకట్రామరెడ్డి, మాకినేని బసవపున్నయ్య, చాకలి ఐలమ్మ, రాజభక్త రామకృష్ణ నేతృత్వం లో 1946 మొదలైన ఈ ఉద్యమం ఈ పోరాటం చరిత్ర లో నెత్తుటితో రాసిన ఒక విప్లవగేయం గా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.